చర్చిలో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి
మొదట చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను
church
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ద్వీలా పరిసరాల్లోని మార్ ఎలియాస్ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లుగా అధికారులు తెలపగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని ఆరోగ్య అధికారులు, భద్రతా వర్గాలు తెలిపాయి. డమాస్కస్ శివార్లలోని ద్వీలాలో మార్ ఎలియాస్ చర్చి లోపల ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా పేలుడు సంభవించింది. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది.
ఇలాంటి దాడి సిరియాలో సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. డమాస్కస్ లోని ఇస్లామిస్ట్ పాలనలో మైనారిటీల మద్దతును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా దేశవ్యాప్తంగా అధికారాన్ని చెలాయించడానికి కష్టపడుతున్న తరుణంలో, యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో తీవ్రవాద గ్రూపుల స్లీపర్ సెల్స్ ఉనికి గురించి ఆందోళనలు మొదలయ్యాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కథనం ప్రకారం దాడి చేసిన వ్యక్తి మొదట చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను పేల్చుకున్నాడు. దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం సంభవించిందని సంస్థ తెలిపింది.