Solar Eclipse : నేడు సూర్యగ్రహణం.. భారత్ లో మాత్రం?

నేడు సూర్యగ్రహణం సంభవించనుంది

Update: 2026-02-17 02:15 GMT

నేడు సూర్యగ్రహణం సంభవించనుంది. వలయాకారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే దీనివల్ల సూర్యుడిని 96 శాతం భాగాన్ని చంద్రుడు కప్పేస్తాడు. ఈరజు ఫాల్గుణ అమావాస్య సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలతో పాటు అన్ని ప్రాంతాల్లో పూజలు నిర్వహించనున్నారు. వలయాకార సూర్యగ్రహణం భారత కాల మాన ప్రకారం మధ్యాహ్నం 3.26 గంటలకు ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

కొన్ని దేశాల్లో మాత్రమే...
సాయంత్రం తిరిగి 5.10 గంటల నుంచి 6.15 గంటల మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, రాత్రి 7.58 గంటలకు గ్రహణం ముగుస్తుందని చెప్పారు. అయితే ీ సూర్యగ్రహణం భారత్ లో కనిపించే అవకాశం లేదు. కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అర్జెంటీనా, చిలీ, మోజాంబిక్, బోట్స్వానా, మారిషస్, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News