ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా

పుష్ప-2 ప్రీమియర్ షో లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి సంఘటన హైదరాబాద్ లో జరిగింది

Update: 2024-12-05 01:56 GMT

పుష్ప-2 ప్రీమియర్ షో లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి సంఘటన హైదరాబాద్ లో జరిగింది. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతితన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ , సన్వీక తో కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎ థియేటర్ కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు

తొక్కిసలాటలో...
ఈ సమయంలో జరిగిన తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు వెంటనే పోలీసులు విద్యా నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రేవతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News