Gold Prices Today : బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? నిపుణులేమంటున్నారంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగున్నాయి.
బంగారం ధరలు దిగిరావడానికి కారణాలు ఏంటి? ఇంకా పసిడి ధరలు పతనమవుతాయా? వెండి ధరలు కూడా అందుబాటులోకి వస్తాయా? ఇవీ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఎందుకంటే గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. పూర్తిగా ధరలు అందుబాటులోకి రాలేదు కానీ, పెరగకపోగా, ఎంతో కొంత ధరలు దిగి రావడం కొంత మంచి పరిణామమేమని చెప్పాలి. ఇదే పరిస్థితి ఎంత కాలం ఉంటుందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మధ్య ప్రాచ్యంలో యుద్ధం తీవ్రమవుతుంది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రారంభమై తొమ్మిది రోజులవుతుంది. అయినా ధరలు దిగి వస్తున్నాయంటే అందుకు కారణాలేంటన్న దానిపై ప్రస్తుతం మార్కెట్ నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
పెట్టుబడి పెట్డిన...
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టడం మంచిదా? కాదా? అన్నది కూడా తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. గతంలో ధరలు పెరుగుతాయని మార్కెట్ న ిపుణులుచెప్పేవారు. కానీ నేడు వారు కూడా సరైన దిశగా అంచనాలు వేయలేకపోతున్నారు. యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ, తగ్గుతుండటం కొంత ఉపశమనమనే చెప్పాలి. అందుకే బంగారం, వెండి ధరలను అంచనా వేయడానికి మార్కెట్ నిపుణులు, బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ కు కూడా అందడం లేదు. అందుకే వారు బంగారం, వెండి వస్తువులు కొనాలని కాని, వద్దని కానీ, పెట్టుబడి పెట్టమని కాని, పెట్టవద్దని కాని స్పష్టమైన ప్రకటన ఏవీ చేయడం లేదు.
ధరలు తగ్గి....
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు ఊపందుకున్నాయి. ధరల పెరుగుదల విషయంలో ఇంకా తగ్గుతాయేమోనని చాలా మంది వేచి చూస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టిన వారు మాత్రం ధరలు దిగి వస్తుండటంతో ఆందోళనలో ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,63,530 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర .2,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.