Gold Prices Today : బంగారం కొనుగోలుకు వెళుతున్నారా? అయితే మీకొక అలెర్ట్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.
బంగారం, వెండి ధరల పెరుగుదల ఇటీవల కాలంలో కొంత శాంతించాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిలకడగానో, తగ్గుతోనో వస్తున్నాయి. భారీగా తగ్గుదల లేకపోయినా.. పరవాలేదు...సీజన్ లో ధరలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్దం జరుగుతున్న సమయంలో ధరలు తగ్గడం అంటే ఆషామాషీ కాదు. అందుకే ఇంకా ధరలు తగ్గుతాయని అనేక మంది బంగారం, వెండి కొనుగోలు చేయకుండా వెయిట్ చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కు అవసరమైన బంగారం, వెండి వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పరవాలేదు.. పెరగకపోగా.. తగ్గితే చాలు అన్న సంతృప్తి వినియోగదారుల్లో కనిపిస్తుంది.
తగ్గుతాయని అనుకుంటే...
మరొక వైపు బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గుతాయని భావించడం అత్యాశే అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతు న్నారు. అవసరమున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ప్రపంచంలో నెలకొన్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారడం వంటి కారణాలతో ధరలు రానున్న కాలంలో పెరిగే అవకాశముందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి అమ్మకాలు కూడా పెరిగాయి. గతంతో పోలిస్తే అమ్మకాలు ఊపందుకున్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,860 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,62,390 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 3,00,100 రూపాయలకు చేరుకుంది.