Hyderabad : హైదరాబాద్ లో నిలిచిపోనున్న గిగ్ వర్కర్ల సేవలు
ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో గిగ్ వర్కర్లపై ప్రభావం చూపుతుంది
ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో గిగ్ వర్కర్లపై ప్రభావం చూపుతుంది. తెలంగాణలో దాదాపు నాలుగున్నర లక్షల మంది గిగ్ వర్కర్లున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి సర్వీసుల ద్వారా వీరు ఉపాధి పొందుతున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇప్పుడు స్విగ్గీ, జొమాటో డెలివరీలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశముంది.
ఫుడ్ డెలివరీ ...
హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిలిపివేయడంతో వీరి సేవలు కూడా నిలిచిపోయే అవకాశముంది. మరొకవైపు సీఎన్జీ, గ్యాస్ పై నడిచే వాహనాలు కూడా నిలిచిపోనున్నాయి. ప్రధానంగా హోటల్స్ నుంచి ఆర్డర్స్ రాకపోవడంతో వీరు ఉపాధి కోల్పోయే అవకాశముంది. ఇక ఈ కామర్స్, గ్రోసరీ డెలివరీల వరకూ కొద్దిరోజులు సాగనున్నాయి. ఫుడ్ డెలివరీ మాత్రం ఇప్పటికే పలుచోట్ల ఆలస్యమవుతుండగా, మరికొన్ని సంస్థలు మాత్రం ఆర్డర్లను రిజెక్ట్ చేస్తున్నాయి.