Gold Prices Today : బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? నిపుణులేమంటున్నారంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి

Update: 2026-03-08 03:42 GMT

బంగారం ధరలు పెరగకుండా వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ధరలు పెరగడం లేదు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలయి ఎనిమిది రోజులవుతుంది. అయతే నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. కొన్ని రోజులు తగ్గుతూ, మరికొన్ని రోజులు స్థిరంగానూ కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవని, ఇంకా తగ్గుతాయని వేచి చూడటం అవివేకమని కూడా సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరల విషయంలో అంచనాలు ఎప్పుడూ నిజం కావంటున్నారు.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
బంగారం, వెండి ధరల పెరుగుదల ఎవరి చేతుల్లోనూ ఉండదు. అలాగని ధరలు పెరిగినప్పుడు బాధపడటం, తగ్గినప్పుడు సంతోషం మామూలే. కానీ ధరలు మరింత దిగివస్తాయని అనేక మంది ఇంకా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలని ఉత్సుకత ఉన్నప్పటికీ ధరలు ఇంకా అందుబాటులోకి రాలేదని కొంత వెనకడుగు వేస్తున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు అవసరమైనంత మేరకు కొనుగోలు చేస్తున్నారని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గాలంటే అది సాధ్యం కాకపోవచ్చన్నది ట్రేడ్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది.
ధరల పెరుగుదలపై...
ధరల పెరుగుదలపై అనేక మంది అనేక రకాల అంచనాలు వినిపిస్తున్నాయి. కొందరు ధరలు ఇంకా తగ్గుతాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం మళ్లీ పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయలుగా నమోదయింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,63,640 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,90,000 రూపాయలు ట్రేడ్ అవుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News