Gold Prices Today : బంగారం ఇప్పుడు కొనడం మంచిదేనా? వేచి చూడటమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండిధరలు స్వల్పంగా తగ్గాయి.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనుగోళ్లతో మార్కెట్‌లు సందడిగా ఉండాల్సిన సమయం. కానీ గోల్డ్ షాపుల్లో పెద్దగా ఆ సందడి లేదు. పట్టపగ్గాలు లేకుండా పెరిగి పోయిన బంగారం ధర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి తిరిగి తిరోగమనం బాట పట్టింది. అయితే బంగారం ధరలు మరింత తగ్గుతాయని కొందరు భావిస్తున్నారు. ఇంతకు మించి తగ్గే అవకాశముండదని, తగ్గినా స్వల్పంగానే తగ్గుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2025లోనే బంగారం ధర 60 శాతం పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు. అసాధారణమైన పెరుగుదల. ఇది ఒకరకంగా ‘బబుల్’ అన్నారు అప్పట్లోనే ఎక్స్‌పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని.. సామాన్యులు ఆ ట్రాప్‌లో పడవద్దని హెచ్చరించారు.
యుద్ధం ఎఫెక్ట్...
అయితే ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా మాత్రం ధరలు పెరుగుతాయని అనుకున్నా క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం బంగారం ధరలు తగ్గడం లేదు. పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని మెల్లగా అమ్ముకుని లాభాలు తీసుకున్నారు. . చివరికి రేట్లు పడిపోయాక..వాళ్లు లాభాల్లో ఉంటారు. గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు. ఏదైనా వస్తువు ధర సప్లై-డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్‌లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జే.పీ మోర్గాన్ బ్యాంక్ “స్పూఫింగ్” అనే టెక్నిక్ వాడి గోల్డ్ రేట్‌ను అమాంతం పెంచేసింది.
పెళ్లిళ్ల సీజన్ కూడా...
పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కావడంతో ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ కొంత తగ్గుదల కనిపిస్తుండటం సంతోషకరమైన అంశమే. అయితే పెట్టుబడి పెట్టి వెనక్కు తీసుకోని వారు మాత్రం నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండిధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,670 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.