యుద్ధం ఎఫెక్ట్... మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించారు

Update: 2026-03-11 02:59 GMT

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లోనూ ఇప్పటికే ప్రారంభమయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వర్క్ ఫ్రం హోం కల్చర్ మళ్లీ మొదలయింది. ఎల్.పి.జీ కొరత ఏర్పడుతుందని హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేయడంతో హాస్టల్స్ లో ఉండి ఆఫీసులకు వచ్చే ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అందుకే అందరికీ ఇక వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని త్వరలోనే ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది.

పీజీలు కూడా మూతపడుతుండటంతో...
ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరగడం, గ్యాస్ కొరత ఏర్పడటంతో ఆఫీసులకు వెళ్లే ఖర్చు భారమవుతోంది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా అంతరాయం ఏర్పడటం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. రవాణా ఖర్చులు పెరగడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. పాకిస్థాన్ వంటి దేశాలు ఇప్పటికే ఇంటి నుంచే పని చేయాలని సూచిస్తున్నాయి. ఇదే పరిస్థితి భారత్లోనూ ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో హాస్టల్స్, పీజీలు సైతం మూతపడుతున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News