Cyber Crime : సైబర్ వలలో రిటైర్డ్ జడ్జి.. 1.60 కోట్లకు టోకరా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు.

Update: 2026-03-09 07:52 GMT

cyberabad cyber crime news

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. వారి వలలో ఉన్నత చదువులు చదివిన వారు సయితం పడుతున్నారు. తాజాగా రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్ అయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆయన నుంచి . 1.66 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జికి సైబర్ నేరగాళ్ల మోసం తప్పలేదు. వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ అంటూవిచారణ జరుగుతుందని చెప్పి ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఆధార్ కు లింక్ అయి ఉన్న రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతర కాల్స్ చేస్తున్నారని మాజీ జడ్జిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు, బెంగళూరులోని ఇందిరానగర్ లో మీపై కేసు నమోదు అయిందని భయభ్రాంతులకు గురిచేశారు.

మానవ అక్రమ రవాణా కేసును...
ఆయనపై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోదు అయిందని సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారింట్ జారీ చేసిందని కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ విషయాలపై కుటుంబ సభ్యులు గాని స్నేహితులతో కానీ చర్చించవద్దని డిజిటల్ అరెస్ట్ చేసిన నిందితులు, మీ బ్యాంకు ఖాతాలు వివరాలు ఇవ్వాలని భయపెట్టి, మీరు చెల్లించే మొత్తం విచారణ తర్వాత తిరిగి ఇస్తామని మస్కా కొట్టారు. అరెస్టు చేస్తే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భయపడి రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్లకు రిటైర్డ్ జడ్జ్ బదిలీ చేశారు. మోసగాళ్లు చెప్పిన విధంగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను రిటైర్డ్ జడ్జ్ ఆశ్రయించిన కేసు నమోదు చేసుకుని నేరెడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News