ఫ్లైఓవర్ కింద గణేశుడి విగ్రహం

హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తాలో గణేశుడి విగ్రహం తీసుకు వెళుతున్న వాహనం ఇరుక్కుపోయింది

Update: 2025-08-24 04:56 GMT

వినాయక చవితి కోసం విగ్రహాలను గత కొద్ది రోజులుగా మంటపాలకు తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తాలో గణేశుడి విగ్రహం తీసుకు వెళుతున్న వాహనం ఇరుక్కుపోయింది. ఫ్లై ఓవర్ కు తగలడంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట్ కు వెళుతున్న లారీ వెళుతుండటంతో ఎత్తుగా ఉన్న గణేశుడి విగ్రహం తగిలి ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది.

పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద...
దీంతో పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. విగ్రహం ఎత్తును, ఫ్లై ఓవర్ ను అంచనా వేయకుండా తీసుకెళ్లినందునే ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అయితే వెంటనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి లారీని బంజారాహిల్స్ వైపు మళ్లించారు. గణేశవిగ్రహాలు తీసుకుని వెళ్లేవారు ఎత్తు, విద్యుత్తు తీగలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు.


Tags:    

Similar News