విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దవుతున్నాయి

Update: 2026-03-14 07:47 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దవుతున్నాయి. ప్రయాణికులకు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేయడంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి కోల్‌కొగతా వెళ్లాల్సిన విమానం రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.

రద్దు కావడంతో...
విమానం రద్దు కావడంతో ప్రయాణికుల అందోళనకు దిగారు. ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ అధికారులకు వాగ్వాదానికి దిగారు. పోలీసులతో పాటు అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వచ్చి ప్రయాణికులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దవుతూనే ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.


Tags:    

Similar News