Hyderabad : విద్యుత్ షాక్ తో హైదరాబాద్ లో ముగ్గురు బలి
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మరణించారు
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మరణించారు. పాతబస్తీలోని బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని మండపానికి తరలించేందుకు సిద్ధమవుతుండగా విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి చెందారు. . విద్యుత్తు తీగలను కర్రలతో పైకి లేపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వినాయక విగ్రహాలు తరలిస్తుండగా...
అలాగే అంబర్ పేట్ లోనూ ఇలాంటి ఘటన జరిగింది. రామ్ చరణ్ అనే యువకుడు విద్యుత్తు షాక్ తగిలి మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే వినాయక విగ్రహాలను తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్తు వైర్లను సొంతంగా ముట్టుకోవద్దని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్తు తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు శాఖ అధికారులు కోరుతున్నారు.