Hyderabad :నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వైపు వెళితే ఇక అంతే
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలకు కొనసాగనున్నాయి. బక్రీద్ సందర్భంగా పోలీసులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలకు కొనసాగనున్నాయి. బక్రీద్ సందర్భంగా పోలీసులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11.30 గంటల వరకూ మీరాలం ట్యాంక్ ఈద్గా వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. నేడు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నాు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...
పురానాపూ్ల్, కామాటిపూర, కిషన్ నుంచి మీరాలం ఈద్గా మీదుగా ప్రార్థన చేసుకునేందుక వచ్చే వాహనదారులను బహదూర్ పుర క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతించారు. మామూలు వాహనదారులను మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ఇక శివరాంపల్లి, దానమ్మ గుడిసెల మీదుగా ప్రార్థన లకోసం వచ్చే వారిని దానమ్మ హట్స్ క్రాస్ రోడ్స్ మీదుగ శాస్త్రిపురం, శంషీర్ గంజ్, నవాబ్ సింగ్ కుంట మీదుగా మళ్లించనున్నారు. పురానాపూల్ నుంచి బహదూర్ పురవైపు వెళ్లే వాహనాలను జియాగూడ, సిటీ కాలేజీ మీదుగా మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్ి నుంచి బహదూర్ పుర వైపు వెళ్లే భారీ వాహనాలను మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ పై నుంచి అనుమతించనున్నారు.