Khairathabad Ganesh : ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి నేడు ఆఖరి రోజు
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి ఈరోజు ఆఖరి రోజు. ఈ అర్ధరాత్రి నుంచి దర్శనాలను నిలిపి వేయనున్నారు
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి ఈరోజు ఆఖరి రోజు. ఈ అర్ధరాత్రి నుంచి దర్శనాలను నిలిపి వేయనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పదకొండు రోజులుగా పూజలందుకున్న గణనాధుడు ఎల్లుండి నిమజ్జనానికి బయలుదేరి వెళతారు. ఈరోజు ఆఖరి రోజు దర్శనం అని తెలియడంతో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి వద్దకు చేరుకుంటున్నారు.
పన్నెండు గంటల వరకూ
ఈరోజు అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ భక్తులకు ఖైరతాబాద్ గణేశుడికి వద్దకు అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకూ దాదాపు ముప్ఫయి లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఈ నెల 6వ తేదీన శోభాయాత్రకు బయలుదేరి వెళ్లనుండటంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి నిమజ్జనం కోసం కలశ పూజ నిర్వహించనున్నార. శంషాబాద్ నుంచి తీసుకు వచ్చిన క్రేన్ తో గణేశుడిని లారీపై చేర్చనున్నారు. ఇందుకోసం అర్థరాత్రి వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు