జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికిపోయారు. నార్సింగ్ లో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో ఈగల్ టీం బృందంతో పాటు నార్సింగ్ పోలీసులు కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో...
ఆ ఇద్దరిలో ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఒకరు. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలడంతో వారిని డీ ఎడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సుధీర్ రెడ్డి కొంత కాలంగా గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు