లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సిట్ తనిఖీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.

Update: 2025-07-27 04:05 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సిట్ తనిఖీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. బంజారాహిల్స్ భారతి సిమెంట్ లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. భారతి సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో సిట్ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం సోదాలు నిన్నటి నుంచి నిరంతరంగా నిర్వహిస్తుంది.

భారతి సిమెంట్స్ లో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం భారతి సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానాలతో సిట్ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్ లో డైరెక్టర్ గా ఉండటంతో ఇక్కడ సోదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 3,500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. హైదరాబాదులో ఆరు డెన్లకు భారతి సిమెంట్ నుండి ముడుపులు తరలించినట్లు గుర్తించినట్లు తెలిసింది. భారతీ సిమెంట్ లో మద్యం సరఫరా కంపెనీలు , డిస్టలరీల యజమానులతో సమావేశాలు ఇక్కడే నిర్వహించి అనంతరం ముడుపులను భారతీ సిమెంట్ కంపనీ లో అందజేసినట్లు సిట్ అధికారుల అనుమానిస్తున్నారు.


Tags:    

Similar News