నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగ్లీ

సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Update: 2026-04-11 12:42 GMT

సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 150 కోట్ల మోసం చేశారంటూ తనపై సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మార్చి 21 న సుబ్బారావు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదు చేశారు. అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని పిర్యాదులో పేర్కొన్నారు.

తనను కలవాలంటూ...
తనను కలవాలని ఒత్తిడి చేసినట్టు, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో మంగ్లీ పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని మంగ్లీ బెదిరిస్తున్నట్లు న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ ఫిర్యాదు చేశారు. మంగ్లీ ఫిర్యాదును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News