హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది

Update: 2026-04-09 03:01 GMT

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిలువ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాంలో మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పే పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

దుండిగల్ పరిధిలోని...
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్‌లో భారీ అగ్ని ప్రమాదంలో ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంలో రోడ్లపై కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్ములు ఎగిసిపడుతున్నాయి. మరొవైపు దుండిగల్ పరిధిలోని బహదూర్ పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రి గోదాంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇంట్లోకి వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నాయి. 


Tags:    

Similar News