Hyderabad : హైదరాబాద్ పోలీసులు .. రౌడీ షీటర్లకు..

హైదరాబాద్‌ పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు

Update: 2026-04-10 05:29 GMT

హైదరాబాద్‌ పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 1,300కు పైగా రౌడీషీటర్లున్నారు. వీరందరిలో 250 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 190 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పరీక్షలు నిర్వహించగా...
వీరంతా గంజాయి వినియోగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వీరికి ఎక్కడి నుంచి గంజాయి లభిస్తుంది? ఎవరు తెచ్చిస్తున్నారు? ఎంత కాలం నుంచి ఈ గంజాయి వాడకం జరుగుతుందన్న వివరాలను రౌడీషీటర్ల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. పాత నేరాల చిట్టాను కూడా తీస్తున్నారు. 


Tags:    

Similar News