Hyderaad: 4.62 కోట్ల గంజాయి సీజ్.. థాయ్ లాండ్ నుంచి

హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు

Update: 2026-04-10 07:26 GMT

హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 4.62 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ చేశారు. గత చాలారోజుల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో డ్రగ్స్ర, గంజాయి బయటపడుతుంది.

ప్రయాణికుడిని అదుపులోకి ...
ఇతర దేశాల నుంచి వచ్చే వారు ఎక్కువగా తమ వస్తువులతో పాటు డ్రగ్స్, గంజాయిని మోసకొస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేయాలని భావించి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈరోజు థాయ్‌లాండ్ నుంచి గంజాయి తీసుకు వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.


Tags:    

Similar News