Hydra : అమీన్ పూర్ లో ఆక్రమణల కూల్చివేత.. కోట్ల రూపాయల విలువైన భూమి స్వాధీనం

హైడ్రా భారీ ఆపరేషన్ ప్రారంభించింది

Update: 2026-04-11 04:53 GMT

హైదరాబాద్ లో హైడ్రా భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఒకవిధంగా హైడ్రా ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద ఆక్రమణల కూల్చివేతలలో ఇది కూడా ఒకటి. అమీన్ పూర్ లో అక్రమంగా నిర్మించిన భవనాలను ఉదయం నుంచి కూల్చివేతలను ప్రారంభించింది. వీకెండ్ కావడంతో ఆరంతస్తుల భవనాలను కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమయింది. ఉదయాన్నే బుల్ డోజర్లతో పాటు వందల సంఖ్యలో పోలీసులు, హైడ్రా సిబ్బంది మొహరించారు. 850 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటుంది. దీని విలువ కోట్ల లోనే ఉంటుందని అంచనా.

కబ్జా కు గురవుతున్న...
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ , ఇనాం భూములను గుర్తించిన హైడ్రా అక్కడ ఆక్రమణలను కూల్చివేయడం ప్రారంభించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేయనుంది. గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు.
ఎమ్మార్పీఎస్ నేత పిలుపుతో...
ఇప్పటికే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, హైకోర్టు లాయర్ ముఖిమ్ గతవారం ప్రెస్ మీట్ నిర్వహించి.. ఐలాపూర్ గ్రామాన్ని కాపాడుకోవాలని..హైడ్రా కూల్చివేసి ప్రయత్నంచేస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఆక్రమణల కూల్చివేతలను సవాల్ గా తీసుకున్న హైడ్రా మం మొత్తం ఎఫ్ టీ ఎల్.. బఫర్ జోన్ లో ఉన్నట్లు హైడ్రా పరిశీలనలో నిర్ధారణ కావడంతో కూల్చివేతలను ప్రారంభించింది.


Tags:    

Similar News