ముస్లిం ఓటర్లను ఎందుకు తొలగించారు?

పశ్చిమ బెంగాల్ లో ముస్లిం ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు

Update: 2026-04-09 04:41 GMT

పశ్చిమ బెంగాల్ లో ముస్లిం ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, లక్షలాది మంది ముస్లిం ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అర్హులైన ఓటర్లకు...
బరంపూర్, సమ్సేర్‌గంజ్, మొతాబారి, మాణిక్ చక్ నియోజకవర్గాల్లో గణనీయమైన శాతం ముస్లిం ఓటర్ల పేర్లు అడ్జుడికేషన్ లిస్ట్‌లో ఉన్నాయని, దీంతో వారు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఫారినర్స్ ట్రిబ్యునల్ త్వరగా ఏర్పాటు చేసి, అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News