Gold Price Today : మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు.. ఇక ఆగేటట్లు లేవుగా?
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
పశ్చిమాసియా యుద్ధం కొంత ఆగిన వెంటనే మళ్లీ బంగారం ధరలు పుంజుకున్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రేపటి నుంచి ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది తిరిగి బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. కొనుగోళ్లు కూడా పెరిగాయి. దీంతో బంగారం, వెండి ధరలు కొంత పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరింతగా పైకి...
బంగారం ధరలు మరింత పైపైకి వెళ్లే అవకాశముందని ముందు నుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కానీ ఇంకా ధరలు తగ్గుతాయని వేచి చూసే వారికి బంగారం ధరలు షాకిచ్చాయి. ధరలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేసినట్లుగానే పెరిగి గోల్డ్ లవర్స్ కలను తుంచేశాయి. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతుండటం, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో తిరిగి బంగారం ధరలు తగ్గుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో బంగారం కొనుగోళ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,53,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,65,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.