సింగర్ మంగ్లీపై కేసు నమోదు
సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది
సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేశారని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించారంటూ పంజాగుట్ట పోలీసులకు అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
150 మందిని మోసం చేశారంటూ...
దాదాపు 150 మందిని మోసం చేశారని వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.