ట్రాఫిక్ నియంత్రణలో రౌడీ షీటర్లు
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. రాచకొండ కమిషనరేట్‌లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. 60 మంది రౌడీషీటర్లు ట్రాఫిక్ విధులు నిర్వహించారు. కుషాయిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 20 మంది చొప్పున ట్రాఫిక్ నియంత్రణతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్నాళ్లపాటు నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలిగే రౌడీషీటర్లను ఎంపిక చేసి ట్రాఫిక్ నియంత్రణ విధులు అప్పగిస్తున్నారు. పోలీసు నిఘాలో ఉండే మరికొందరు రౌడీషీటర్లను ఈ సంస్కరణల కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు రూపొందించామని పోలీసులు తెలిపారు.