Revanth Reddy : నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

Update: 2025-11-01 03:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను కలుసుకుంటున్నారు. బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించనున్నారు.

హామీలు ఇస్తూ...
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ప్రకటించారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేడు కూడా అనేక బస్తీల్లో పర్యటించనున్నారు.


Tags:    

Similar News