తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోం
తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది
తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నేతలు హాజరయ్యారు. తేనేటి విందును గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం లోక్ భవన్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలవురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
రాజకీయ నేతలు హాజరు...
దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరై ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఫర్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ను ప్రదానం చేశారు.