Hyderabad : ఈరోజు నుమాయిష్ కు ఎవరూ రాకండి
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదం జరగడంతో నాంపల్లి, అబిడ్స్, మొజంజాహి మార్కెట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఈరోజు శనివారం కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ కు ఎవరూ రావద్దని పోలీసులు తెలిపారు.
భారీగా ట్రాఫిక్ స్థంభించి...
ఎగ్జిబిషన్ కు ఎవరూ రావద్దని, మరో రోజు వస్తే మంచిదని హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అబిడ్స్, గాంధీభవన్, నాంపల్లి ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయని, అందుకే ఎవరూ ఈరోజు ఎగ్జిబిషన్ కు రాకుండా ఉండటమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. వస్తే ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశముందని చెబుతున్నారు.