ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జిరిగింది.

Update: 2026-01-28 03:04 GMT

హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జిరిగింది. ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ లో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పిల్లర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎనిమిది మంది...
కారులో మొత్తం ఎనిమిది విద్యార్థులున్నారని గుర్తించారు. అతివేగంతోప్రయాణిస్తున్నందునే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. గాయపడిన వారు వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News