Hyderabad : బెట్టింగ్ యాప్స్ కేసులో రానా హాజరు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా సినీనటుడు రానా దగ్గుబాటి సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు

Update: 2025-11-15 13:42 GMT

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా సినీనటుడు రానా దగ్గుబాటి సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ శనివారం ఆయన సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అడిగిన ప్రశ్నలకు రానా సమాధానాలు ఇచ్చారు. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీలతో ఒప్పందాలు ఎలా కుదిరాయి? ఏ అంశాలు పరిశీలించారు? అంటూ అధికారులు వివరాలు రానాను అడిగి తీసుకున్నారు.

ఆధారాలను సమర్పించి...
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏజెన్సీలతో తాను ఒప్పందం చేసుకోలేదని రానా తన వివరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. యాప్‌ ప్రమోషన్‌కు ముందుగా ఆ ఏజెన్సీ నిజాయితీని తన న్యాయ బృందం పరిశీలించిందని రానా తెలిపారు. మొత్తం ఒక గంటకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. పూర్తి ఆధారాలను సీఐడీ అధికారులకు రానా అందచేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News