IBomma : నేడు రవి కస్టడీపై న్యాయస్థానంలో

ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్‌ వేశారు

Update: 2025-11-26 03:10 GMT

ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్‌ వేశారు. రవి కస్టడీ కోసం నాంపల్లి కోర్టులో మరోసారి పోలీసుల పిటిషన్‌ వేశారు. నేడు కస్టడీ పిటీషన్ పై న్యాయస్థానంలో తీర్పు చెప్పనుంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 5 రోజుల కస్టడీకి కస్టడీ పిటీషన్ లో పోలీసులు కోరారు. ఇప్పటికే ఐదు రోజులపాటు రవిని పోలీసులు విచారించారు.

విచారణకు సహరించకపోవడంతో...
అయితే ఐదు రోజుల విచారణలో రవి పోలీసులకు సహకరించకపోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మరో కేసులో రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్ వేశారు. దీనిపై నేడు న్యాయస్థానం తన నిర్ణయాన్ని చెప్పనుంది. మరొకవైపు రవి తరుపున లాయర్లు బెయిల్ పిటీషన్ పై విచారించాలని న్యాయమూర్తిని కోరనున్నారు.


Tags:    

Similar News