Hyderabad : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Update: 2025-01-26 02:14 GMT

నేడు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.రిపబ్లిక్ డే వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాలు ఉండటంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఆంక్షలు విధించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఉదయం 7:30 నుంచి .11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. సాయంత్రం 4గంట నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ పోలీసులు నిర్ణయించారు.

ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా...
పంజాగుట్ట, బేగంపేట్‌, సికింద్రాబాద్ వైపు..వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు..షెడ్యూల్ కంటే ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఎవరినీ అనుమతించబోమని, తెలియకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News