Hyderabad : హైదరాబాదులో డ్రగ్స్ కలకలం

హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు

Update: 2025-12-23 04:39 GMT

హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు సరఫరాదారులు, ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ పోలీసులు అప్పగించారు. హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లోని కో లివ్ గెర్నట్ పీజీలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను, డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ ...
నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్‌లను, హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌లు డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన అనంతరం, వారిని తదుపరి విచారణ కోసం రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ పోలీసులకు అప్పగించారు. నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది.


Tags:    

Similar News