డిసెంబరు 13న హైదరాబాద్‌కు మెస్సీ

అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రానున్నారు.

Update: 2025-11-11 15:10 GMT

అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రానున్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్న మెస్సీ సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. మెస్సీ భారత పర్యటన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్వాహకులు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. మెస్సీ హైదరాబాద్‌ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితో మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News