లోకేంద్రసింగ్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ మ్యాన్‌

అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం. అయితే తనకు వీలు దొరికినప్పుడల్లా ట్రాఫిక్ ను క్రమ బద్ధీకరించే పనిని చేపడుతూ ఉంటారు.

Update: 2025-11-05 11:08 GMT

అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం. అయితే తనకు వీలు దొరికినప్పుడల్లా ట్రాఫిక్ ను క్రమ బద్ధీకరించే పనిని చేపడుతూ ఉంటారు. లోకేంద్రసింగ్‌ నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అవగాహన కల్పిస్తూ ‘హైదరాబాద్‌ ట్రాఫిక్‌ మ్యాన్‌’గా పేరుగాంచారు. రాజస్థాన్‌ నుండి వచ్చిన వీరి కుటుంబం హైదరాబాద్‌ లో స్థిరపడింది. 18వ ఏట డ్రైవింగ్‌ స్కూల్‌లో చేరినప్పుడు కేవలం డ్రైవింగ్‌ అంశాలపైనే శిక్షణ ఇచ్చారని, ఇతర ట్రాఫిక్‌ నిబంధనల గురించి చెప్పలేదని తెలిపారు లోకేంద్ర. 2021లో హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ వాలంటీర్‌గా చేరాడు. ఇదే ఆలోచన ఉన్న సుమారు 15 మందితో ఓ సమూహంగా ఏర్పడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవడం దగ్గర నుంచి స్టాప్‌ లైన్, లైన్‌ క్రమశిక్షణ, హారన్‌ ప్రాధాన్యం గురించి వివరిస్తూ వెళుతున్నారు. హైదరాబాద్‌ పోలీసుల ద్వారా ట్రాఫిక్‌ వాలంటీర్‌గా పలు అవార్డులు అందుకున్నారు లోకేంద్రసింగ్‌.

Tags:    

Similar News