Hyderabad : విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం పూజలకు సిద్ధమయింది. విగ్రహం 69 అడుగులతో రూపుదిద్దుకుంది
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం పూజలకు సిద్ధమయింది. ఈ ఏడాది విశ్వశాంతి మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న రాత్రి ఖైరతాబాద్ గణేశ్ విగ్రహానికి సంబంధించి అన్ని సిద్ధం చేశారు. విగ్రహం నిర్మించే సమయంలో ఏర్పాటు చేసిన కర్రలను కూడా తొలిగించారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
69 అడుగుల ఎత్తులో...
ఈసారి ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం 69 అడుగులతో రూపుదిద్దుకుంది. అరవై తొమ్మిది అడుగుల ఎత్తు, ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో గణేశుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఖైరతాబాద్ గణేశుడు పూజలు అందుకోనున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలోని అనేక జంక్షన్లలో పోలీసులు నేటి నుంచి పది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.