Congress : నేడు గాంధీ భవన్ లో కీలక సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నేడు గాంధీభవన్ లో జరగనుంది. కాంగ్రెస్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది.

Update: 2025-08-23 04:17 GMT

తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నేడు గాంధీభవన్ లో జరగనుంది. కాంగ్రెస్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై నేడు సమావేశంలో చర్చించనున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై...
మరొకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలోనూ ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశముండటంతో అభ్యర్థి ఎంపిక, ప్రచార బాధ్యతలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీల సమావేశం, యూరియా కొరతపై కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News