విషమంగానే ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏజీఎం వైద్యులు తెలిపారు

Update: 2025-06-07 02:24 GMT

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏజీఎం వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాగంటి గోపినాధ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మాగంటి గోపీనాధ్ అపస్మారక స్థితిలో మూడు రోజుల క్రితం తన ఇంట్లో గుండెపోటుకు గురి కావడంతో వంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

వెంటిలేటర్ పై చికిత్స...
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో, సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కట్టుకోవడం సాధారణ స్థితికి వచ్చిందని, నాడీ ప్రసరణ కూడా మామూలుగానే ఉందని, అయితే మాగంటి గోపీనాధ్ ఇంకా అపస్మారక స్థితి నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. సమయం గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఏఐజీ వైద్యుల బృందం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారని, ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు.


Tags:    

Similar News