Hyderabad : అగ్నిప్రమాదలో రెండు కోట్ల ఆస్తి బుగ్గిపాలు

హైదరాబాద్‌ చందానగర్‌లో నిన్నరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది

Update: 2026-03-13 04:23 GMT

హైదరాబాద్‌ చందానగర్‌లో నిన్నరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. అను ఫర్నీచర్ దుకాణంలో మంటలు భారీగా చెలరేగాయి. ఆరు అగ్నిమాపక కేంద్రాలు , పది వాటర్ ట్యాంకర్లతో మంటలను సిబ్బంది అదుపు చేసింది.

సామగ్రి మొత్తం...
అగ్నిప్రమాదంలో ఫర్నీచర్ దుకాణంలో సామగ్రి కాలిబుడిదయ్యారుర. షోరూమ్‌లో భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. షోరూమ్‌ పక్కన నిర్మాణంలో ఉన్న భవనానికి వ్యాపించిన మంటలు పక్కనున్న ఆసుపత్రి వైపునకు వెళ్లకుండా తగిన చర్యలు సిబ్బంది తీసుకున్నారు. కేవలం ఆస్తి నష్టమే సంభవించిందని చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.


Tags:    

Similar News