దేశీయ తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కేరాఫ్ హైదరాబాద్

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతోంది.

Update: 2025-10-31 15:38 GMT

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతోంది. అన్నీ కలిసొస్తే వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్‌, కమర్షియల్‌ రాకెట్‌ గగనతలంలోకి దూసుకుపోవచ్చని అంటున్నారు. ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తల కంపెనీనే స్కైరూట్‌ ఏరోస్పేస్‌. వచ్చే ఏడాది జనవరిలో అంతరిక్ష్యంలోకి తమ తొలి పూర్తిస్థాయి శాటిలైట్‌ మిషన్‌ను పంపాలని స్కైరూట్‌ ప్రయత్నిస్తోంది. ప్రతీ 3 నెలలకోసారి ఒక ప్రయోగాన్ని చేపట్టాలని స్కైరూట్‌ భావిస్తోంది. 2027కల్లా నెలకోసారి రాకెట్ ప్రయోగాలు చేసేలా ప్రణాళికలు రచిస్తూ ఉంది సదరు కంపెనీ.

Tags:    

Similar News