నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ
నేటితో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగియనుంది.
నేటితో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. న్యాయస్థానం ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. నేటితో కస్టడీ ముగియనుంది. అయితే ఈ నాలుగు రోజుల పాటు పోలీసుల విచారణలో ఇమ్మడి రవి పోలీసులకు సహకరించలేదు. తనకు గుర్తులేదు.. మర్చిపోయానని సమాధానం మాత్రమే చెప్పారని అంటున్నారు.
మరొకొన్ని రోజులు...
దీంతో తమకు మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, విచారణకు రవి సహకరించలేదంటున్న పోలీసులు న్యాయస్థానానికి తెలపనున్నారు. మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇమ్మడి రవి నిర్వహిస్తున్న వెబ్ సైట్లు, బ్యాంకుల్లో నగదు లావాదేవీలు, హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లను ఓపెన్ చేయడంపైనే విచారణ చేయాలనుకున్నా రవి సహకరించలేదని తెలిసింది.