Telangana : చుక్కలు చూపిస్తున్న ఇమ్మడి రవి

పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు

Update: 2025-11-22 11:48 GMT

పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు చెప్పమంటే.. గుర్తు లేదు.. మర్చిపోయానని చెబుతున్నాడు.విదేశాలకు వెళ్లి తిరగడం తన హాబీ అని చెబుతున్నాడు.ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు ఓపెన్ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ప్రతి ఇరవై రోజులకు ఒక దేశంలో పర్యటించడంపై అడగ్గా తనకు పర్యటనలు చేయడం అంటే ఇష్టమని అంతకు మించి మరేమీ లేదని పోలీసులకు సమాధానమిస్తున్నట్లు తెలిసింది.

గుర్తులేదు.. మర్చిపోయా...
ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవిని పోలీసు కస్టడీకి తీసుకుని మూడో రోజు విచారణ చేస్తున్నారు. అతని బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీసినా సమాధానమివ్వకుండా పత్పించకుంటారు.దీంతో పలుబ్యాంకులకు రవి అకౌంట్ల జాబితాను తమకు తెలియజేయాలని కోరారని తెలిసింది. విచారణకు ఇమ్మడి రవి ఏమాత్రం సహకరించక పోవడంతో పోలీసు కస్టడీ మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో మరికొన్నిరోజులు కస్టడీకి అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని అందుతున్న సమాచారం. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లోమెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News