హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Update: 2025-10-17 04:25 GMT

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గోషామహల్ లో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. దాదాపు 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. ఈరోజు ఉదయం నుంచి హైడ్రా సిబ్బంది బుల్ డోజర్లతో వచ్చి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.

ప్రభుత్వ భూమిని...
అశోక్ సింగ్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు. కూల్చివేతలు, ఆక్రమణలను తొలగిస్తున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైడ్రా అధికారులు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News