Hydra : హైడ్రా బుల్ డోజర్ తో కూల్చివేతలు ప్రారంభం.. పదిహేను వేల కోట్ల విలువైన భూమిలో
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన నిర్మాణాలను తొలిగించే ప్రక్రియను ప్రారంభించింది
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన నిర్మాణాలను తొలిగించే ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన భూమిలో కొందరు బడా బాబులు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. పేదలను అడ్డం పెట్టుకుని కొన్ని షెడ్లను నిర్మించారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూముల్లో ఈ ఆక్రమణలు వెలిశాయి.
మూడు వందల ఎకరాల్లో...
దీంతో హైడ్రా అధికారులు ఈ ఆక్రమణలను కూల్చివేసేందుకు బుల్ డోజర్లతో ప్రయత్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగింపు కార్యక్రమాలను చేపట్టింది. కొందరు ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. దాదాపు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ఆక్రమణలను తొలగించి హైడ్రా ప్రభుత్వం పరం చేయనుంది.