Hyderabad : హైదరాబాద్ లో పెట్రోలు కోసం పడిగాపులు
హైదరాబాద్‌లో బంకుల వద్ద భారీగా వినియోగదారులు భారీగా బారులు తీరారు
గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండవని ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌లో బంకుల వద్ద భారీగా వినియోగదారులు భారీగా బారులు తీరారు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పెట్రోలు బంకులు మూసివేశార. దీంతో పెట్రోలు బంకుల వద్ద క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సి ఎన్ జి ఆటోలు బారులు తీరాయి.హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆగకపోవడంతో పెట్రోలు కొరత భారత్ లో ఏర్పడుతుందన్న ప్రచారంతో హైదరాబాద్ లోనూ తమ వాహనాలకు పెట్రోలు కొట్టించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు.
ఆందోళన అవసరం లేదని...
ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోలు ట్యాంకర్లు తమకు రాలేదని వచ్చిన తర్వాత పెట్రోలు పోస్తామని బంకు యజమానులు చెబుతున్నారు. మరొకవైపు అధికారులు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ ఒక్కసారిగా వినియోగదారులు చేరడంతో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది. భారత్ లో నెలన్నర రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో కొన్ని పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు.
ప్రధాన కారణమిదే...
అయితే దీనికి ప్రధాన కారణం గతంలో ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకుల యజమానులకు పెట్రోలు, డీజిల్ ను క్రెడిట్ కు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వమని తేల్చిచెప్పడంతో పెట్రోలు ట్యాంకర్లు ఆయిల్ కంపెనీలు ఇంకా రాలేదని చెబుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ ను ద్విచక్ర, ఫోర్ వీలర్స్ లో నింపేసుకుంటున్నారు. పెట్రోలు నిల్వలు తగ్గిపోతే ధరలు పెరుగుతాయన్న ఆందోళన మరింత పెరిగి వాహనదారులు వరస బెట్టి పెట్రోలు బంకులకు వస్తున్నారు. హైదరాబాద్ లో ఏ పెట్రోలు బంకులో చూసినా వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.