Gold Prices Today : పతనమవుతున్న బంగారం.. నేలచూపులు చూస్తున్న వెండి
. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
బంగారం ధరలు పతనమవుతున్నాయి. వెండి ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో ధరలు మరింత దిగజారుతున్నాయి. ధరలు తగ్గుతుంటంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ఏమి భాగ్యమూ అంటూ జ్యుయలరీ దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతూ అదీ వరసగా దిగివస్తూ వినియోగదారులకు బంగారం, వెండి అందుబాటులోకి వస్తున్నాయి.
ఊపందుకున్న అమ్మకాలు...
దీంతో అమ్మకాలు ఊపందుకున్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. గత పది రోజుల నుంచి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైతే పది రోజులకు పైగానే ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పది రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధరపై దాదాపు ఇరవై వేల రూపాయలు తగ్గిందని, అలాగే కిలో వెండి ధరపై యాభై వేల రూపాయలకు పైగానే తగ్గిందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు జ్యుయలరీ దుకాణాల్లో కొత్త కొత్త డిజైన్లు కనపడుతున్నాయి.
నేటి ధరలు...
మరొకవైపు ధరలు మళ్లీ పెరగవచ్చన్న అంచనాలు కూడా వినిపడుతున్నాయి. ప్రస్తుతం అమ్మకాలు ఊపందుకోవడంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా ప్రకటించనున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,42,900 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.