Gold Price Today : పసిడి దూకుడు.. వెండి పరుగు.. ఇంకెంత కాలమంటే?
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు నిజమవుతున్నాయి. వెండి ధరలు కూడా మళ్లీ పరుగు అందుకున్నాయి. కొంతకాలం ధరలు దిగి వచ్చి తిరిగి ధరల పెరుగుదల ప్రారంభం కావడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పెళ్లిళ్ల సీజన్ మొదలయిన వెంటనే బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ కిలో వెండి మూడు లక్షలకు చేరుకుంటుంది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయన్న ఆశలు పడే వారికి పెరుగుతున్న ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో ఖచ్చితంగా దీని ప్రభావం కొనుగోళ్లపై ఉంటుందని జ్యుయలరీ దుకాణాల యజమానులు ఆవేదన చెందుతున్నారు.
గత ఏడాది పెరిగిన...
2025లో బంగారం ధరలు దూకుడుగా వెళ్లాయి. వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అనేక మంది బంగారం, వెండి పై మదుపు చేశారు. ఏ నెలలోనూ తగ్గలేదు. ప్రతి రోజూ అవి పెరుగుతూనే ఉండటంతో ఒక దశలో బంగారం, వెండి ఏ రేంజ్ లోకి వెళతాయో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమయింది. అయితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ధరలు కొంత దిగి రావడంతో లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం ధర దిగి వస్తుందని అంచనాలు వినిపించాయి. అయితే మళ్లీ ధరలు పెరుగుతుండటంతో ఇక బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉండవన్నది స్పష్టమైంది. పెళ్లిళ్ల సీజన్ నాలుగైదు నెలలు ఉండటంతో ఇక ధరలు తగ్గడం కష్టమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈరోజు ధరలు ఇలా...
అయితే బంగారం, వెండి ధరలు ఎంత పెరిగిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉండటంతో వాటి డిమాండ్ కూడా తగ్గే అవకాశముండదు. ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,900 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి దర 2,95,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి మళ్లీ ధరల్లో మార్పులుండవచ్చు.