హైదరాబాద్ - విశాఖ హైవై ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్‌న్యూస్

Update: 2026-02-26 04:35 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్‌న్యూస్. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనదారులు సుఖంగా ప్రయాణించే వీలు దొరకుతుంది. ఎందుకంటే త్వరలోనే మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య హైటెక్ హంగులతో నిర్మించిన హైవేను మే నెలలో ప్రారంభించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాఖ మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

గ్రీన్ ఫీల్డ్ హైవే...
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌న్యూస్. త్వరలోనే మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ హైవేలపై రద్దీ పెరగటంతో తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో హైవేను నిర్మించారు. ఖమ్మం- ఏపీలోని దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైటెక


Tags:    

Similar News