Telangana : నేడు నాంపల్లికోర్టుకు దగ్గుబాటి హీరోలు
నేడు ఫిల్మ్ నగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేష్ నేడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది
నేడు ఫిల్మ్ నగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేష్ నేడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ లోని తన డెక్కెన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చారంటూ నందకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదయింది.
విచారణకు రాకుంటే...
అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణకు ముగ్గురు దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. విచారణకు రాకపోతే నాంపల్లి కోర్టుల ముగ్గురిపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసే ఛాన్స్ ఉంది. దీంతో నేడు ముగ్గురు నాంపల్లి కోర్టుకు తమ న్యాయవాదితో కలసి హాజరవుతారని చెబుతున్నారు.